- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను కూడా సీఎం అభ్యర్థి అవుతా: కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
కాంగ్రెస్ కీలక నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(Janampalli Anirudh Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/వెబ్‌డెస్క్: మరో రెండు సార్లు.. నన్ను ఎమ్మెల్యేగా.. గెలిపిస్తే నేను కూడా సీఎం అభ్యర్థిని అవుతాను అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జడ్చర్లలో డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి జరిగిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రుల నియోజకవర్గాలకే నిధులు వెళుతున్నాయి. ఒకసారి కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చూడండి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్ల దాదాపుగా రూ.5000 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. మంత్రుల నియోజకవర్గాలలోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు పనులు జరుగుతున్నాయి అన్నారు. నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు ఎన్నో ఆశలతో నన్ను ఎన్నికలలో గెలిపించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతకైనా పోరాడుతాను అని చెప్పారు. ఇంకో రెండు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. నేను కూడా సీఎం అభ్యర్థిని అవుతా.. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాను అని ఎమ్మెల్యే చెప్పారు.






