- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ నేతలు మోదీకి గులాంగిరి చేస్తున్నారు: ఆది శ్రీనివాస్
తెలంగాణ బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. బీజేపీ నేత రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. రామచంద్రరావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. బీజేపీ నేత రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. రామచంద్రరావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. నరేంద్ర మోడీ వద్ద చేతులు కట్టుకుని ఆమడదూరంలో నిలుచుని మాట్లాడే మీదే అసలైన గులాంగిరీ అనే పదం వర్తిస్తుందని అన్నారు. రాష్ట్రం నుండి ఎనిమిది మంది ఎంపీలు గెలిచినా తెలంగాణకు ఒక్క పైసా నిధులు కూడా తీసురాలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పనంగా పెట్టి మీ పదవులు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతుల ధాన్యం కొనిపించే అర్హత కూడా లేదని మండిపడ్డారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి ఏటీఎం రేవంత్ రెడ్డికి అని మాట్లాడుతున్నారని, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే నిధులు తీసుకువచ్చి నిర్మించాలన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టాలన్నా రేవంత్ రెడ్డే నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మోడీ, అమిత్ షా దగ్గర చెప్రాసిలా పని చేసే మనస్థత్వం ఉన్న మీరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. తుమ్మడిహెట్టి గురించి చర్చలు జరిపేందుకు మహరాష్ట్ర సీఎంతో బీజేపీ అపాయింట్మెంట్ కూడా ఇప్పించడంలేదని విమర్శించారు.






