- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వండి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
by Ajay Maddhiboyina |
వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మనం ఫెడరల్ ప్రభుత్వంలో ఉన్నామని, ఫెడరల్ స్పూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మనం ఫెడరల్ ప్రభుత్వంలో ఉన్నామని, ఫెడరల్ స్పూర్తితో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యేలు చేయాల్సిన పని ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయాల్సిన పని ఎంపీలు చేసే పరిస్థితి ఉందన్నారు. ఓసారి వేములవాడ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కు ఇచ్చారని, ఒకసారి బీజేపీకి ఇచ్చారని అన్నారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అవకాశం ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీకి అవకాశం ఇచ్చారని కానీ కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు చేసి ఓటు వేయాలని సూచించారు. అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వేములవాడ అభివృద్ధి చెందాలంటే, టెంపుల్ సిటీగా మారాలంటే తమను గెలిపించాలని కోరారు.
Next Story






