- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరు చేర్చుకున్నప్పుడు ఏమయ్యాయి విలువలు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగింది.

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగింది. స్పీకర్ చర్య ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. న్యాయస్థానాలపై ఏ మాత్రం విలువ లేదని, రాహుల్ గాంధీ మాటకు టీ కాంగ్రెస్ విలువ ఇవ్వడం లేదని అన్నారు. అయితే గులాబీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినప్పుడు విలువలు గుర్తులేవా అని ఎద్దేవా చేసారు.
గతంలో గులాబీ పార్టీ కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని.. తలసాని శ్రీనివాస్ యాదవ్ కు, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారని గుర్తు చేసారు. స్పీకర్ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని, స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చని సలహా ఇచ్చారు.






