- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
42 ఎకరాల నుంచి 22 ఎకరాలకు.. మియాపూర్ పటేల్ చెరువు గర్భశోకం!
జల వనరులు ధ్వంసం చేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది. చెరువులు, కుంటలు సంరక్షించి, నీటిని మోసుకొచ్చే నాలాలు పునరుద్ధరిస్తే భూగర్భ జలాలు వృద్ధి చెంది తాగునీటి సమస్యలు తీరుతాయని గుర్తించడం లేదు.

జల వనరులు ధ్వంసం చేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది. చెరువులు, కుంటలు సంరక్షించి, నీటిని మోసుకొచ్చే నాలాలు పునరుద్ధరిస్తే భూగర్భ జలాలు వృద్ధి చెంది తాగునీటి సమస్యలు తీరుతాయని గుర్తించడం లేదు. నీడనిచ్చే చెట్టును నరుక్కున్నట్లు దాహార్తిని తీర్చే మియాపూర్ పటేల్ చెరువు సుందరీకరణ పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ మరోవైపు కబ్జాలకు పాల్పడుతున్న ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్న ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు తనను ఏ విధంగా చెరబట్టి దోచుకుంటున్నారో తన దీనగాధ చెబుతోంది. తనను నిర్లక్ష్యం చేస్తే గుక్కెడు నీరు దొరక్క అల్లాడిపోతారని తన గర్భాన్ని ఛిద్రం చేసి కోట్లు ఎలా సంపాదిస్తున్నారో చెబుతాను. నా రక్షణ కోసం ఉన్న రెవెన్యూ ,ఇరిగేషన్ అధికారులు పూడికతీత, కట్ట నిర్మాణం పేరుతో తో అందిన కాడికి దోచుకుని ఆక్రమణలకు ఉతమిస్తే తాను ఎంతో నమ్ముకున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నా గర్భశోకం అర్థం చేసుకోవడం లేదు. 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తాను సుమారు 22 ఎకరాలకు పరిమితం చేశారు. అది ఎలా సాధ్యం అయిందో చెబుతా చదవండి.
దిశ, శేరిలింగంపల్లి: ‘‘మియాపూర్ ప్రధాన రహదారికి ఆనుకుని 42 ఎకరాల విస్తీర్ణంలో నిండా నీటితో కళకళలాడాయి. తనలో చేరిన మురికి నీటిని శుద్ధి చేస్తానని చెప్పి మొదటి విడత మంజూరైన రూ.14 కోట్లు నిండైన నా రూపాన్ని సర్వ నాశనం చేశారు. జేబులు నింపుకున్నారు. నీటిని మోసుకొచ్చే నా కాలువపై హోటల్ కట్టారు. తాజాగా ఫంక్షన్ హాల్ కోసం భారీ షెడ్ నిర్మించారు. టాకీ టౌన్ థియేటర్ నాలోనే ఉంది. అంతటితో ఆగకుండా పార్కింగ్ పేరుతో ఎకరా కబ్జా చేశారు. అలా ముందుకు వెళ్తే ఐదంతస్తులు చొప్పున మూడు బ్లాకులు ఎఫ్ టీఎల్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత భూ బకాసురులు 12 ఎకరాల చెరువు భూమి ఆక్రమించి నిరుపేదలకు విక్రయించి కోట్లు సంపాదించారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత అపార్ట్మెంట్ నిర్మించాడు. పేరు మోసిన ఓ బిల్డర్ మూడు ఎకరాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే అధికారులు వంత పాడారు. అపార్ట్ మెంట్లు విక్రయించి పరారయ్యాడు. ఆ తర్వాత కలప వ్యాపారులు ఒక్కో వ్యక్తి ఎకరా పైబడి కబ్జా చేసి కలప వ్యాపారం నిర్వహిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఆరేళ్ల క్రితం అప్పటి చందానగర్ కమిషనర్ మమత భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేశారు. కోట్ల రూపాయల విలువ చెరువు భూములు ఆక్రమించి వ్యాపారులు తిరిగి నిర్మాణాలు చేపట్టి యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కీలక నేత ప్రధాన అనుచరుడి కోసం చెరువు కట్ట వంకర్లు తిరిగింది.’’ ఆ స్థలంలో నర్సరీ ఏర్పాటుకు సహకరించి లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
చెరువు నీటితో నిండేది ఎన్నడు..!
రాష్ట్ర ప్రభుత్వం అమృత్ 2.0 కింద నగరంలో 39 ఎస్టీపీల కోసం సుమారు రూ. 3,849.10 కోట్లు పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల్లో మియాపూర్ పటేల్ చెరువు ఉంది. 7 ఎంఎల్‌డీ మురికినీటి శుద్ధి ప్లాంట్ (ఎస్‌టీపీ) నిర్మాణానికి నాలుగు కోట్లు చెరువు అభివృద్ధికి అదనంగా నిధులు మంజూరు చేశారు. ప్రస్తుతం హైడ్రా పర్యవేక్షణలో పనులు ప్రారంభం కావలసి ఉంది. కానీ 20 ఎకరాలు కబ్జాదారులకు వదిలిపెట్టి ప్రస్తుతం 22 ఎకరాలకే పరిమితం చేశారు. కాలనీలు ముంపునకు గురవుతున్నా.. చెరువులోకి చుక్క నీరు రాకుండా చేశారు. కోర్టు కేసుల పేరుతో జాప్యం చేస్తున్నారు. నీటిని ఖాళీ చేసి భారీ ఎత్తున కబ్జాలకు పాల్పడుతున్నారు.






