- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శర్వానంద్ 'జార్జ్ క్రిష్' స్టార్ట్ అయ్యేది అప్పుడే.. సూపర్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత
'జార్జ్ క్రిష్' తొలి షెడ్యూల్ ఆగస్టు రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు అనిల్ సుంకర చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా కొంతకాలం క్రితమే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'జార్జ్ క్రిష్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తైనప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమా తొలి షెడ్యూల్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తొలి షెడ్యూల్‌ను ఆగస్టు రెండో వారం నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అయితే తొలి షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్ పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది.
రెండో షెడ్యూల్‌లో శర్వానంద్, హీరోయిన్‌లపై లవ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురు నటీమణుల పేర్లు వినిపించినప్పటికీ, చివరకు భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రంతో శర్వానంద్ విజయాన్ని అందుకున్నాడు. మరి మరోసారి సంక్రాంతి బరిలోకి దిగనున్న ఆయన మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.






