Miss World competition: మిస్ వరల్డ్ పోటీలు.. ఓపెనింగ్ సెర్మనీ కోసం రిహార్సల్స్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-09 07:40:50  IST  )

తెలంగాణ ప్రభుత్వం (Telangana) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్‌ వరల్డ్‌ పోటీలకు (Miss World competitions) సర్వం సిద్ధమైంది.

Miss World competition: మిస్ వరల్డ్ పోటీలు.. ఓపెనింగ్ సెర్మనీ కోసం రిహార్సల్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న మిస్‌ వరల్డ్‌ పోటీలకు (Miss World competitions) సర్వం సిద్ధమైంది. శనివారం (మే 10వ తేదీ) గచ్చిబౌలి స్టేడియం (Gachibowli Stadium)లో ఘనంగా ఓపెనింగ్ సెర్మనీ జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పోటీల నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటికే మిస్ వరల్డ్–2025 పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి 109 దేశాలకు చెందిన పోటీదారులు, ప్రతినిధులు, ఆహ్వానితులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో పోటీదారులు ఉత్సాహంగా రిహార్సల్స్‌లో పాల్గొన్నారు. అందాల భామలు స్టేజ్‌పై తమ ప్రతిభకు తగిన కార్యక్రమాలను ఎంపిక చేసుకొని ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, మిస్‌ వరల్డ్‌ పోటీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ గజరావ్‌ భూపాల్‌ తెలిపారు. హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీదారులు బస చేస్తున్న హోటళ్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఎక్కువ మంది బస చేస్తున్న ట్రిడెంట్‌ హోటల్‌ వద్ద నాలుగంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీవీఐపీ కేటగిరీని బట్టి వారు బస చేస్తున్న పరిసరాలను గ్రీన్‌జోన్‌, రెడ్‌ జోన్‌గా విభజించామని చెప్పారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎలాంటి ట్రాఫిక్‌ మళ్లింపులు ఉండవని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.

Next Story