- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Miss World wishes: తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మిస్ వరల్డ్ సుచాత (వీడియో)
తెలంగాణలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తెలంగాణ ప్రజలకు విషెస్ తెలియజేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Telangana State Formation Day)తెలంగాణలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తెలంగాణ ప్రజలకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది (Miss World) మిస్ వరల్డ్ కిరీటం కైవసం చేసుకున్న థాయిలాండ్ సుందరీ ఓపల్ సుచాత (Opal Suchatha), పలువురు సుందరీమణులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ జరూర్ఆనా’ అంటూ వారు నినదించారు. ఈ మేరకు తాజాగా వారు ఒక వీడియో విడుదల చేశారు.సాంస్కృతిక ఐక్యత, అంతర్జాతీయ స్నేహభావంతో వారు హృదయపూర్వక సందేశాలను ప్రజలతో పంచుకున్నారు.
కాగా, తెలంగాణ ప్రభుత్వం, టూరిజం శాఖ (Department of Tourism), మిస్ వరల్డ్ సంస్థ కలిసి హైదరాబాద్‌లో ఇటీవల మిస్‌వరల్డ్-2025 పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పోటీల్లో థాయిలాండ్ బ్యూటీ ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ మిస్‌వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. అయితే ఇవాళ రాజ్‌భవన్‌లో మిస్‌వరల్డ్ బ్యూటీలకు తేనీటి ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ ఓపల్ సుచాతతో పాటు రన్నరప్స్ ఆరేలి జాచిమ్, మయా క్లైడా, హాసెట్ డెరెజే, తదితరులు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. మిస్ వరల్డ్ జర్నీని గవర్నర్తో విషయాలు పంచుకోనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. గత శనివారం రాత్రి ఈ మిస్‌వరల్డ్ పోటీలు ముగిశాయి. దీంతో చాలా మంది ప్రపంచ సుందరీమణులు తమ తమ దేశాలకు వెళ్లిపోయారు.






