Miss World Opal: బతుకమ్మ ఆడిన మిస్ వరల్డ్ ఓపల్ సుచాత.. హైదరాబాద్‌లో సందడి

by Ramesh Naini |   (  Updated:2025-09-28 11:40:07  IST  )

బతుకమ్మ సంబురాల్లో ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ సందడి చేశారు.

Miss World Opal: బతుకమ్మ ఆడిన మిస్ వరల్డ్ ఓపల్ సుచాత.. హైదరాబాద్‌లో సందడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బతుకమ్మ వేడుకలు (Bathukamma celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బతుకమ్మ సంబురాల్లో ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ (Opal Suchata Chuangsri) సందడి చేశారు. మహిళలు, చిన్నారులతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. హైదరాబాద్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మిస్ వరల్డ్ ఓపల్ సుచాత పాల్గొన్నారు. అందరితో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఓపల్ సుచాత ఈ సందర్భంగా అన్నారు. కాగా, బ్రెస్ట్ కాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో పాల్గొందుకు నగరానికి వచ్చిన ప్రపంచ సుందరి బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ సంబరాలతో పాటు వివిధ కార్యక్రమాల్లో ప్రపంచ సుందరి పాల్గొనే అవకాశం ఉంది.

Next Story