అంగరంగ వైభవంగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే.. విజేతగా నిలిచిన ఓపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ

by Kema Shiva Kumar |

72వ మిస్ వరల్డ్ ఫినాలే వేడుకలు హైదరాబాద్ హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి.

అంగరంగ వైభవంగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే..  విజేతగా నిలిచిన ఓపల్‌ సుచాత చువాంగ్‌శ్రీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: 72వ మిస్ వరల్డ్ ఫినాలే వేడుకలు హైదరాబాద్ హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం ఆయన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. మిస్ వరల్డ్ ఫినాలే‌కు న్యాయ నిర్ణేతలు‌గా జూలియా మోర్లీ, సోనూసూద్, సుధా‌రెడ్డి, రానా దగ్గుబాటి, జయేష్ రంజన్, మనూషి చిల్లర్, నమ్రత శిరోద్కర్, డోనా‌వాల్ష్ వ్యవహరించారు.

అవార్డుల బహూకరణ..

మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్‌గా నియామకం అయిన సుధా‌రెడ్డి‌కి మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా సుధా‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ అవార్డ్ తనకు చాలా ప్రత్యేక‌మని, చాలా ఆనందంగా ఉందన్నారు. అద్భుతమైన ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వానికి, టూరిజం శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. మొదట‌గా ఒక్కో ఖండం నుంచి 10 మంది ఫాస్ట్ ట్రాక్ విన్నర్ లను ఫైనల్ ఈవెంట్‌కు నిర్వాహకులు పరిచయం చేశారు. అనంతరం ఖండాల వారీగా టాప్ 10 నుంచి, ఐదుగురిని షార్ట్ లిస్ట్ చేశారు. మిస్ వరల్డ్ బ్యూటీ విత్ పర్పస్‌గా మిస్ ఇండోనేషియా ఎన్నికయ్యారు. పరిశుభ్రమైన నీరు అందరికీ అవసరం అనే విషయం ప్రచారం చేస్తూ నీటి కాలుష్యంపై మిస్ ఇండోనేషియా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు నటుడు చిరంజీవి, దిల్ రాజు, విజయ్ దేవరకొండ హాజరయ్యారు.

ఖండాల వారీగా ఎంపికలు:

ఖండాల వారీగా టాప్-5 నుంచి ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేశారు. అందులో అమెరికా నుంచి బ్రెజిల్, మార్టినిక్, ఆఫ్రికా నుంచి ఇథియోపియా, నమీబియా యూరప్ నుంచి.. పోలెండ్, ఉక్రెయిన్, ఆసియా నుంచి..ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాలకు చెందిన ముద్దుగుమ్మలను ఎంపిక చేశారు. అందులో ఇండియా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నందిని గుప్తా‌కు మాత్రం చోటు దక్కలేదు. ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని నిర్వాహకులు షార్ట్ లిస్ట్ చేశారు. నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావు.. అని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి అవకాశం న్యాయ నిర్ణేతలు మార్కులు వేశారు. అమెరికా ఖండం నుంచి మార్టినిక్, ఆఫ్రికా నుంచి ఇథియోపియా, యూరోప్ నుంచి పోలెండ్, ఆసియా నుంచి థాయిలాండ్ దేశాలకు చెందిన సుందరీ‌మణులు ఎన్నికయ్యారు.

సోనూసూద్‌కు హ్యుమానీటేరియన్ అవార్డు

కరోనా సమయంలో సోనూ‌సూద్ చేసిన మానవతా చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డును రానా దగ్గుబాటి చేతుల మీదుగా జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ తనకెంతో ప్రత్యేకమని కొనియాడారు. వదల బొమ్మాళి అంటూ డైలాగ్ చెప్పడం‌తో సభను కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది.

72 మిస్ వరల్డ్ విజేతగా థాయిలాండ్ సుందరి..

తెలంగాణ ఆతిథ్యం ఇచ్చిన మిస్ వరల్డ్ 72 విజేతగా థాయిలాండ్‌కు చెందిన సుందరీమణి ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ నిలిచింది. ఈ మేరకు మాజీ మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా‌, సుచాత అలంకరించారు. ఇక రెండవ స్థానంలో ఇథియోపియా, మూడో స్థానంలో పోలెండ్, నాలుగో స్థానంలో మార్టినిక్ నిలిచింది.

Next Story