ఐసిడిఎస్ బాలసదన్ చిన్నారులతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్

by Muthe.Rajitha |

ప్రభుత్వ ఐసిడిఎస్ బాలసదన్ చిన్నారులతో కలిసి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేశారు.

ఐసిడిఎస్ బాలసదన్ చిన్నారులతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఐసిడిఎస్ బాలసదన్ చిన్నారులతో కలిసి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేశారు. బుధవారం నాడు హైదరాబాద్ లోని హోటల్ ట్రిడెంట్‌ వేదికగా మిస్ వరల్డ్ పోటీదారులు "హార్ట్ ఆఫ్ గోల్డ్" పేరిట ఓ వినూత్నమైన చారిటీ ఈవెంట్‌ను నిర్వహించారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల ప్రభుత్వ ఐసీడిస్ బాల సదన్‌లలోని అనాథ చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ను కలిసే అవకాశం చిన్నారులకు కలిపించాలాని ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చిన్నారులతో ముచ్చటిస్తూ, వారితో కలిసి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. అనాథ చిన్నారులను తమ ఒడిలో కూర్చోబెట్టుకొని సెల్ఫీ, వీడియోలు తీయించుకుంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ పోటీదారుల్లో చాల వరకు సామాజిక సేవలో ఉన్నవారు కావడం గమనార్హం. చిన్నారులతో ఆసక్తిగా ముచ్చటించారు. లైవ్ బ్యాండ్ సంగీతానికి చిన్నారులతో కలిసి ఉత్సాహంగా డాన్స్‌లు చేశారు.

200 విద్యార్థులకు ఏడాది పాటు సహకారం.. రూ. 2 కోట్ల చెక్కు అందవేత ..

ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ , సుదీక్ష ఎస్టేట్స్ సంస్థలు మిస్ వరల్డ్ సంస్థతో కలిసి బాలసదన్​లోని 200 మంది అనాథ పిల్లలకు ఏడాది పాటు సహాయం చేసేందుకు స్పాన్సర్‌షిప్ ప్రోగ్రామ్‌ కింద( రూ. 2 కోట్ల చెక్కు ) అందజేశాయి. అనాథ విద్యార్థులకు విద్యా , పాఠ్యపుస్తకాలు, పోషకాహార, నెలవారీ రేషన్ సరఫరా, దుస్తులు, స్కూల్ కిట్లు , బాత్‌రూమ్ అవసరాలకు టాయిలెట్రీలు , చిన్నారులకు ఆటబొమ్మలు ఇలా 200 కిట్లను చిన్నారులకు అందించారు. ఒక్కో చిన్నారికి అందాల పోటీదారులు చేతులమీదగా ఈ కిట్లని అందజేశారు. ఇలా అనాథ పిల్లలకు ఏడాది పాటు సహాయం చేస్తామని దాతలు ప్రకటించారు. మిస్ వరల్డ్ సంస్థ చైర్‌పర్సన్ , సీఈఓ జూలియా మోర్లే మాట్లాడుతూ ఇది ‘బ్యూటీ విత్ పర్పస్’ యొక్క సారాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులు చిన్నారులతో మమేకమైన తీరు వారి సేవా నిబద్ధతను చాటుతోందన్నారు.

విద్యే మార్గం – మిస్ వరల్డ్ పోటీదారుల సందేశాలు

ఇదిలా ఉంటే విద్య ద్వారానే విజయం, థింక్ బిగ్, థింక్ డిఫరెంట్ అచీవ్ గోల్స్ అంటూ పిల్లలు అడిగిన ప్రశ్నలకు స్ఫూర్తి దాయక సందేశాన్ని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందించారు, "విద్య ద్వారనే ఏదైనా సాధ్యం అని, ఆ లక్ష్యాన్ని కచ్చితంగా నిర్దేశించుకొని కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు" అని వారు పేర్కొన్నారు. సామాజిక సేవ పట్ల తమ ఆసక్తిని పంచుకుంటూ చిన్నారుల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామీణ జిల్లాల బాలసదనాల పిల్లలకు ప్రపంచ స్థాయి ప్లాట్‌ఫాం లో కొత్త అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించింది. చిన్నారులకు ఇది జీవితాంతం గుర్తుండి పోతుంది కూడా.

Next Story