Miss World: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి

by Ramesh Naini |

మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తెలంగాణలో రోజుకో ప్రాంతంలో పర్యటిస్తున్న సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

Miss World: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ (Miss World contestants) తెలంగాణలో రోజుకో ప్రాంతంలో పర్యటిస్తున్న సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బంజారాహిల్స్ లోని (Police Command Control Center) పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు మిస్ వరల్డ్-2025 కంటెస్టెంట్స్ చేరుకునక్నారు. మిస్‌వరల్డ్ కాంటిస్టెంట్లకు పోలీస్ అశ్విక దళం, పైపు బ్యాండ్, మోటర్ సైకిల్ రైడర్స్‌తో పోలీస్ శాఖ ఘన స్వాగతం పిలికింది. ప్రపంచ సుందరీమణులకు కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో రాష్ట్రంలో శాంతి భద్రతలపై పోలీసు శాఖ చేపట్టిన ఇనిషియేటివ్‌లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివీ ఆనంద్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో వివరించారు. దేశంలోనే తెలంగాణ పోలీస్‌కు చెందిన 80 వేల మంది నిరంతరం శాంతి, భద్రతలో నిమగ్నమై అత్యున్నత పోలీస్‌గా నిలిచిందని వారు తెలిపారు.

కాగా, నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో మిస్ వరల్డ్ బ్యూటీలు కనువిందు చేశారు. 108 మంది మిస్ వరల్డ్ పోటీదారులకు అధికారులు, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రతినిధులు వారికి సాదర స్వాగతం పలికారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నేత రామ్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్, రామోజీ గ్రూప్ సంస్థ సీఎండీ కిరణ్ తదితరులు విదేశీ అతిథులకు స్వాగతం పలికారు. ప్రిన్స్ స్ట్రీట్ కన్వెన్షన్ హాల్ నుంచి ప్రత్యేక బస్సుల్లో బాహుబలి సెట్ వద్దకు చేరుకున్న మిస్ వరల్డ్ బ్యూటీలు మాహిష్మతి సామ్రాజ్య అందాలను వీక్షించారు. రానా వంద అడుగుల విగ్రహాన్ని చూసి అబ్బుర పోయిన అందాల భామలు.. పట్టాభిషేకం చేసిన ప్రదేశంలో గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. ఇక మొఘల్ గార్డెన్స్ అందాలను కూడా తిలకించి, శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించారు.

Next Story