- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పోర్ట్స్ డే ఈవెంట్‌లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్.. దేవర పాటకు స్టెప్పులేసిన ముద్దుగుమ్మలు
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ ఫైనల్ ఈవెంట్‌లో డీజే పాటకు మిస్ వరల్డ్ బ్యూటీస్ డ్యాన్స్ ఇరగదీశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ ఈవెంట్‌లో డీజే పాటకు మిస్ వరల్డ్ (Miss World) బ్యూటీస్ డ్యాన్స్ ఇరగదీశారు. శనివారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కోసం స్పోర్ట్స్ డే (Sports Day event) ఈవెంట్ నిర్వహించారు. మొత్తం పది విభాగాల్లో జరిగిన క్రీడల్లో కంటెస్టెంట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా (BCCI Vice President Rajiv Shukla), మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao), మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ తదితరులు హాజరయ్యారు. ఈ వెంట్‌లో ప్రపంచ సుందరీమణులు దేవర సినిమాలోని ఆయుధ పూజ పాటకు స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించారు.
మరోవైపు పలు క్రీడల్లో ప్రపంచ సుందరీమణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ.. క్రీడలు, మిస్ వరల్డ్‌ల ప్రత్యేక కలయిక అయిన స్పోర్ట్స్ డే ఫిట్‌నెస్ సందేశాన్ని పంపుతుందని, యువతరం ఫిట్‌గా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ పోటీని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని ఆయన అభినందించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
‘మిస్ వరల్డ్ పోటీల ద్వారా ప్రపంచానికి తెలంగాణ సాంస్కృతిక వైభవం, వారసత్వం, సంప్రదాయాలను తెలియజేసే గొప్ప అవకాశం లభించింది. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణలో నిర్వహించడం రాష్ట్రానికే గౌరవం తెచ్చింది. ఈ వేడుకల ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పర్యాటక రంగంలో తన ప్రత్యేకతను చాటిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఇది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ పోటీల ద్వారా అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం’ అని మంత్రి తెలిపారు.






