- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Miss World begins: టీ-హబ్‌లో మిస్ వరల్డ్ సుందరీమణుల సందడి.. కాంటినెంటల్ ఫినాలే షురూ!
72వ మిస్ వరల్డ్ (Miss World) పోటీలు తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: 72వ మిస్ వరల్డ్ (Miss World) పోటీలు తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పోటీలు గత 28 రోజుల పాటు వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతున్నాయి. 109 దేశాల ముద్దుగుమ్మలు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు పోటీపడుతున్నారు. భారత్ తరపున రాజస్థాన్‌కు చెందిన 21 ఏళ్ల నందిని గుప్తా (Nandini Gupta) పోటీలో ఉన్నారు. అయితే ప్రపంచ సుందరీమణుల పోటీలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. హైదరాబాద్ రాయదుర్గంలోని (T-Hub) టీ-హబ్‌లో ఇవాళ, రేపు కాంటినెంటల్ ఫినాలేలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం టీ-హాబ్‌ను ప్రపంచ సుందరీమణలు సందర్శించి సందడి చేస్తున్నారు.
నేటి నుంచి మిస్ వరల్డ్ కాంటినెంటల్ ఫినాలే (Continental finale) టీ-హట్‌లో జరుగనుంది. ఇందులో భాగంగా.. అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా క్లస్టర్‌ల నుంచి అంశాల వారీగా ఎంపిక మొదలైంది. సోమవారం నిర్వహించిన సెకండ్ రౌండ్ కాంపిటీషన్ నుంచి 48 మందిని ఎంపిక చేయగా.. నేపాల్, హైతీ, ఇండోనేషియా కంటెస్టెంట్ల ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి.. విన్నర్‌ను ఈనెల 31న ప్రకటిస్తారు. తెలంగాణలో ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడం వల్ల రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెడుతూ, సాంస్కృతిక, పర్యాటక రంగాలను ప్రోత్సహిస్తున్నాయి.






