- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కేసి పువ్వేసి సందమామ! బతుకమ్మ ఆడిన ప్రపంచ సుందరీమణులు.. శిల్పారామంలో సందడి
తెలంగాణలో ప్రపంచ సుందరీమణులు ప్రసిద్ధి చెందిన ప్రదేశాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రపంచ సుందరీమణులు (Miss World beauties) ప్రసిద్ధి చెందిన ప్రదేశాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే. గురువారం మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ హైదరాబాద్‌లోని శిల్పారామాన్ని (Shilparamam) సందర్శించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ నృత్యాలతో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం బుధవారం రాత్రే జరగాల్సి ఉంది కానీ వర్షం వల్ల నేటికి వాయిదా పడింది. శిల్పారామంలో ప్రపంచ సుందరీమణులు ఒక్కేసి పువ్వేసి చందమామా అంటూ బతుకమ్మ (Bathukamma) ఆడారు. చేతిలో పువ్వులను పట్టుకొని సాంప్రదాయ తీరులో అందాల భామలు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఆటకు సుందరీమణులు ఫిదా అయ్యారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్‌లోని ఐకానిక్ విక్టోరియా మెమోరియల్ హోమ్‌ను సందర్శించనున్నారు.
మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక, 72వ మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కలిసి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పోటీలు తాజాగా కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే టాప్ 25 లిస్ట్‌ను సంస్థ విడుదల చేసింది. భారత్ తరపున రాజస్థాన్‌కు చెందిన 21 ఏళ్ల నందిని గుప్తా (Nandini Gupta) పోటీలో ఉన్నారు. ఈ పోటీలు మే 10 వ తేదీన ప్రారంభమవ్వగా మే 31 వరకు జరగనున్నాయి. ఆ రోజే విన్నర్‌ని కూడా ప్రకటిస్తారు.






