- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామోజీ ఫిల్మ్ సిటీలో మిస్ వరల్డ్ బ్యూటీలు
రామోజీ ఫిల్మ్ సిటీలో మిస్ వరల్డ్ బ్యూటీలు కనువిందు చేశారు. 108 మంది మిస్ వరల్డ్ పోటీదారులకు అధికారులు, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రతినిధులు వారికి సాదర స్వాగతం పలికారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రామోజీ ఫిల్మ్ సిటీలో మిస్ వరల్డ్ బ్యూటీలు కనువిందు చేశారు. 108 మంది మిస్ వరల్డ్ పోటీదారులకు అధికారులు, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రతినిధులు వారికి సాదర స్వాగతం పలికారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నేత రాంరెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్, రామోజీ గ్రూప్ సంస్థ సీఎండీ కిరణ్ తదితరులు విదేశీ అతిథులకు స్వాగతం పలికారు. ప్రిన్స్ స్ట్రీట్ కన్వెన్షన్ హాల్ నుంచి ప్రత్యేక బస్సుల్లో బాహుబలి సెట్ వద్దకు చేరుకున్న మిస్ వరల్డ్ బ్యూటీలు మాహిష్మతి సామ్రాజ్య అందాలను వీక్షించారు. రానా వంద అడుగుల విగ్రహాన్ని చూసి అబ్బురపోయిన అందాల భామలు.. పట్టాభిషేకం చేసిన ప్రదేశంలో గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. మొఘల్ గార్డెన్స్ అందాలను కూడా తిలకించి, శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించారు.
Next Story






