Miss World 2025 : బుద్ధవనాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ అందగత్తెలు

by Muthe.Rajitha |

మిస్ వరల్డ్(Miss World 2025) పోటీలలో పాల్గొనబోయే అందగత్తెలు సోమవారం బుద్ధవనాన్ని(Boudha Theam Park) సందర్శించారు.

Miss World 2025 : బుద్ధవనాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ అందగత్తెలు
X

దిశ, వెబ్ డెస్క్ : మిస్ వరల్డ్(Miss World 2025) పోటీలలో పాల్గొనబోయే అందగత్తెలు సోమవారం బుద్ధవనాన్ని(Boudha Theam Park) సందర్శించారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 22 మంది సుందరీమణులు నాగార్జునసాగర్(Nagarjuna Sagar) లోని బుద్ధవనంలో పర్యటించారు. కాగా వీరికి జానపద, గిరిజన నృత్యలతో వందల సంఖ్యలో కళాకారులు ఘనంగా స్వాగతం పలికారు. బుద్ధవనంలో ఉన్న బౌద్ధ విగ్రహం వద్ద ధ్యానం వంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేడు బుద్ధ పూర్ణిమ(Boudha Purnima)ను పురస్కరించుకొని ప్రపంచ సుందరీమణులు బౌద్ధవనాన్ని సందర్శించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని నిర్వాహకులు తెలియజేశారు. కాగా మిస్ వరల్డ్ 2025 కాంటెస్ట్ ఈనెల 31 వరకు హైదరాబాద్(Hyderabad) లో జరగనున్న విషయం తెలిసిందే.

Next Story