- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిస్ వరల్డ్-2025 ఫినాలే పోటీలు షురూ.. ర్యాంప్ వాక్‌తో మెరిసిన ముద్దుగుమ్మలు
మిస్ వరల్డ్-2025 (Miss World-2025) గ్రాండ్ ఫినాలే పోటీలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: మిస్ వరల్డ్-2025 (Miss World-2025) గ్రాండ్ ఫినాలే పోటీలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు జాక్విలిస్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ ప్రదర్శనల నడుమ హైదరాబాద్ (Hyderabad)లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ (Hitex Exhibition Center)లో ఈ ఫైనల్ ఈవెంట్ కొనసాగుతోంది. అదేవిధంగా 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ స్టేజ్‌పై సందడి చేస్తోంది. మొత్తం 108 దేశాల ముద్దుగుమ్మలు స్టేజ్‌పై ర్యాంప్ వాక్‌తో అదరగొడుతున్నారు.
విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు ఇప్పటికే పలు పోటీల్లో సత్తా చాటిన 16 మంది కార్టర్స్ ఎంపికయ్యారు. ఫైనల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ విభాగానికి అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాల చెందిన ఒక్కొక్కరిని ఎంపిక చేయనున్నారు. అనంతరం తుది ప్రశ్న ద్వారా మిస్ వరల్డ్‌ను ప్రకటిస్తారు. ఫైనల్ పోటీలకు జడ్జిలుగా.. జూలియా మోర్లీ, సోనూసూద్, సుధారెడ్డి, రానా దగ్గుబాటి, జయేష్ రంజన్, మనూషి చిల్లర్, నమ్రత శిరోద్కర్, డోనా వాల్ష్ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ చేనేత వస్త్రాలతో రూపొందించిన భారతీయ సంప్రదాయ వస్త్రాలతో కంటెస్టెంట్‌లు ఆకట్టుకున్నారు. ఈ మిస్ వరల్డ్ పోటీలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు, సతీమణి గీతారెడ్డి, కూతురు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు, 3500 మంది అతిథులు హాజరయ్యారు.






