- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ చేరుకున్న మిస్ కెనడా
ఈ నెల 6వ తేదీ నుండి హైదరాబాద్ వేధికగా మిస్ వరల్డ్ అందాల పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 6వ తేదీ నుండి హైదరాబాద్ వేధికగా మిస్ వరల్డ్ అందాల పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలకు వివిధ దేశాల నుండి సుందరీమణులు విచ్చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల బ్యూటీలు భాగ్యనరంలో వాలిపోయారు. కాగా తాజాగా మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కేథరిన్ మోరిసన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈ ముద్దుగుమ్మకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాలతో ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ అందాల పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పోటీల ద్వారా తెలంగాణ కల్చర్‌ను ఇతర దేశాలకు తెలిసేలా చేయాలని నిర్ణయించింది. తెలంగాణ పర్యాటక శాఖ దీనికోసం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు పోటీలలో పాల్గొనే భామలు హైదరాబాద్ చేరుకోనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి. మే 31వ తేదీన ఫైనల్స్ జరగనున్నాయి. ఆ రోజే విజేత ఎవరు అనేది తేలనుంది.






