హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ బాయ్‌పై దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

హైద‌రాబాద్ మ‌ల్లాపూర్ ప్రాంతంలో జెప్టో డెలివ‌రీ బాయ్ పై ఓ అపార్ట్‌మెంట్ వాసి దురుసుగా ప్రవర్తించాడు. తిరుమల మిలీనియం అపార్ట్మెంట్‌లో సరుకులు ఇచ్చేందుకు వెళ్లిన డెలివరీ బాయ్ పై బూతులతో రెచ్చిపోయాడు.

హైదరాబాద్‌లో జెప్టో డెలివరీ బాయ్‌పై దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: హైద‌రాబాద్ మ‌ల్లాపూర్ ప్రాంతంలో జెప్టో డెలివ‌రీ బాయ్ పై ఓ అపార్ట్‌మెంట్ వాసి దురుసుగా ప్రవర్తించాడు. తిరుమల మిలీనియం అపార్ట్మెంట్‌లో సరుకులు ఇచ్చేందుకు వెళ్లిన డెలివరీ బాయ్ పై బూతులతో రెచ్చిపోయాడు. అతడి చేతిలోని సరుకులు లాక్కుంటూ తిట్ల దండకం అందుకున్నాడు. డెలివరీ బాయ్ ఎంత ఓపికగా సమాధానం చెప్పినా కోపంతో రగిలిపోతూ అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి ప్రవర్తనను డెలివరీ బాయ్ తన ఫోన్ లో వీడియో తీశాడు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ల ఐడీలను పూర్తిగా బ్లాక్ చేయాలని సూచిస్తున్నారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్ మెంట్‌ను ట్యాగ్ చేస్తున్నారు. అయితే డెలివరీ బాయ్స్ పై దాడులు జరగటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలా సార్లు డెలివరీ బాయ్స్ పై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని ఘటనల్లో నింధితులను అరెస్ట్ సైతం చేశారు. ఇక తాజాగా జరిగిన ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Next Story