- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీర్జాగూడ బస్సు ప్రమాదం.. లక్కీనంబర్ ఎవరికి కలిసి వచ్చింది?
కొత్త వాహనాలు కొని, వాటిని రిజిస్ట్రేషన్ చేయించేటపుడు ఆ నంబర్లలో కానీ, వాటన్నింటినీ కలిపి చివరికి సింగిల్ డిజిట్ ఫలానా నంబర్ వస్తే కలిసి వస్తుందని చాలా మంది భావిస్తుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: కొత్త వాహనాలు కొని, వాటిని రిజిస్ట్రేషన్ చేయించేటపుడు ఆ నంబర్లలో కానీ, వాటన్నింటినీ కలిపి చివరికి సింగిల్ డిజిట్ ఫలానా నంబర్ వస్తే కలిసి వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. దాన్నే లక్కీ నంబర్ గా పరిగణిస్తారు. అలా 9 అంకెను లక్కీ నంబర్ గా నమ్మేవారు చాలా ఎక్కువే ఉంటారు. అందుకే రిజిస్ట్రేషన్ల సమయాల్లో 9999 అనే ఫ్యాన్సీ నంబర్ ను లక్షలు ధారపోసి మరీ కొనుక్కుంటారు. మీర్జాగూడ బస్సు ప్రమాదానికి, ఈ నంబర్ కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా ?
తాండూరు నుంచి హైదరాబాద్ కు ప్రయాణికులతో వస్తున్న బస్సు సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం పదుల సంఖ్యలో మరణించిన వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. శోకాతప్త హృదయాలతో బాధితుల కుటుంబీకులు మార్చురీ వద్ద రోదిస్తున్న తీరు గుండెలను పిండేస్తుంది.
ప్రమాదానికి కారణమైన టిప్పర్ రిజిస్ట్రేషన్ నంబర్ 3879, ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు రిజిస్ట్రేషన్ నంబర్ 6354. ఈ రెండింటినీ కూడితే ఆఖరికి 9 వస్తుంది. ఆర్టీసీ రిజిస్ట్రేషన్లు లక్ మీద ఆధారపడి ఉండవు. కానీ ఆ టిప్పర్ ఓనర్ ఆ నంబర్ రావాలనుకుని చేయించి ఉంటే? ఈ రోజు జరిగిన ప్రమాదం అతనికి కలిసి వచ్చినట్టా?. ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు పాటించాలి. మలుపుల వద్ద తక్కువ స్పీడుతో వాహనాలను నడపాలి. ఇక్కడ రాంగ్ రూట్ లో వెళ్లడం ఒక తప్పయితే.. మితిమీరిన వేగంతో వెళ్లడం మరో తప్పు. అతివేగంతో బస్సు ఢీ కొట్టిన టిప్పర్.. బస్సును చీల్చుకుంటూ వెళ్లింది. టిప్పర్ లోడులో ఉన్న కంకరపై టార్ఫాలిన్ కవర్ లేకపోవడంతో అదంతా బస్సులో ఉన్న ప్రయాణికులపై పడి.. 19 మంది ప్రాణాలు కంకరలో కలిసిపోయాయి.
READ MORE .....






