- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"నాన్నా.. ఓ ఉద్యోగిని ప్రేమించాను.. ఆయన దగ్గరకు వెళ్తున్నా".. ఓ మైనర్ బాలిక లేఖ
నవాబుపేట మండలంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక ప్రేమ పేరుతో ఇంటి నుండి ఎటోవెళ్లిపోయి

దిశ, నవాబుపేట: నవాబుపేట మండలంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలిక ప్రేమ పేరుతో ఇంటి నుండి ఎటోవెళ్లిపోయి అందరినీ కలవరపర్చింది. ముక్కుపచ్చల్లారని మైనర్ బాలిక ఓ వ్యక్తి ప్రేమలో పడి, ఆ వ్యక్తి మాయమాటలు నమ్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇల్లు విడిచి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక డిగ్రీ చదవడానికి మహబూబ్‌నగర్ పట్టణంలోని ఓ కళాశాలలో చేరింది.
వచ్చే సోమవారం రోజున ఆమె జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిలోని వసతి గృహానికి వెళ్లాల్సి ఉండగా, శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను గాలించగా ఆమె గదిలోని పుస్తకాల మధ్య ఓ లేఖ కనిపించింది. అందులో తాను ఓ ఉద్యోగిని ప్రేమిస్తున్నానని, అతనిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని, చదువు కొనసాగించకూడదని, ఫార్మసీ కోర్సు చేయాలనుకుంటున్నానని రాసి ఉంది.
లేఖతో పాటు ఆమె స్టడీ సర్టిఫికెట్లు కూడా గల్లంతైనట్లు తల్లిదండ్రులు గుర్తించారు. ఈ ఘటనపై తీవ్ర ఆందోళనకు గురైన బాలిక తండ్రి నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై ఎం.విక్రమ్ దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇదే మండలంలో ఇటీవలి కాలంలో మైనర్ బాలికల అదృశ్య ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, తల్లిదండ్రుల మధ్య ఆందోళన నెలకొంది. పోలీసులు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఇలా సంఘటనలు జరుగుతుండడం భద్రతాపరమైన సమస్యలపై పలు ప్రశ్నలు కలిగిస్తోంది. ఈ ఘటనల మిస్టరీలను ఛేదించి, సమాజంలో భరోసా కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు పోలీసులదే కావాలంటూ స్థానికులు అభిప్రాయపడుతున్నారు.






