- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SLBC tunnel : ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి మరోసారి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లిలు
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) పై కప్పు కూలిన ప్రమాదంలో చిక్కుకున్న 8మంది సిబ్బందిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యల(Rescue operation)ను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)మరోసారి ఘటన స్థలానికి చేరుకున్నారు

దిశ, వెబ్ డెస్క్ : ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) పై కప్పు కూలిన ప్రమాదంలో చిక్కుకున్న 8మంది సిబ్బందిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యల(Rescue operation)ను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)మరోసారి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఉత్తమ్ తో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణ(Vamsi Krishna),, కలెక్టర్ దావత్ సంతోష్ (Dawat Santosh)లు ఉన్నారు.
టన్నెల్ వద్ద ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. భారత ఆర్మీ రెస్క్యూ బృందం కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు టన్నెల్ వద్ధకు చేరుకుంది. నిన్న టన్నెల్ లో ప్రమాద సమాచారం తెలుసుకోగానే హెలిక్యాప్టర్ లో అక్కడికి చేరుకున్నారు. తిరిగి సాయంత్రం హైద్రబాద్ కు చేరుకుని మళ్లీ ఈ రోజు సంఘటన స్థలానికి మరోసారి హెలిక్యాప్టర్ లో చేరారు. సహాయక చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు.
నిన్న టన్నెల్ లో చిక్కుకున్న వారికోసం వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందం 4 గంటల తరువాత టన్నెల్ నుంచి తిరిగి వచ్చింది. టన్నెల్ లోపలికి 12 కిలోమీటర్ల మేర ట్రైన్ లో ప్రయాణించి అక్కడి నుండి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి మోకాలు లోతు నీరు నిండి ఉండడంతో ముందుకు వెళ్లలేకపోయింది. ప్రమాదం జరిగిన చోట ఆరు మీటర్ల పైన బురదతో నిండిపోవడంతో సాంకేతిక మిషనరీతో వెళ్లాలని భావిస్తున్నారు. ఈరోజు సహాయక చర్యల చర్చలలో ప్రమాదం జరిగిన చోట టన్నెల్ ఉపరితలం పై నుంచి 400మీటర్లు త్వవ్వితే టన్నెల్ లో చిక్కుకున్న వారి వద్ధకు వెళ్లవచ్చన్న ప్రతిపాదనలు సైతం పరిశీలిస్తు్నారు.
కొండపై నుంచి ప్రమాద స్థలానికి చేరాలంటే 400మీటర్లు త్రవ్వాల్సి ఉంటుందని అధికారులు ఉత్తమ్ కు వివరించారు. మరోవైపు టన్నెల్ లో బురద, నీరు పెరిగిపోతుండం రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకంగా మారింది.






