TG News : విద్య, వైద్యం వ్యవసాయమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యంతోపాటు వ్యవసాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు.

TG News : విద్య, వైద్యం వ్యవసాయమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యంతోపాటు వ్యవసాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్(Ponnam Prabhkar), తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao).. విద్య వైద్యం, వ్యవసాయంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన లక్ష్యం విద్య, వైద్యం, వ్యవసాయం అని, ఇవి ప్రజలకు చేరవేయడంలో కలెక్టర్లదే పూర్తి బాధ్యత అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క సెంటు భూమి కూడా వదలకుండా సేద్యం చేసేలా అధికారులు చొరవ చూపాలని, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వ్యవసాయానికి పెద్దపీట వేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Next Story