Hyderabad : బీసీ కుల సంఘాలతో భేటీ కానున్న మంత్రులు

by Muthe.Rajitha |

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే(Cast Census Survey)ను ప్రభుత్వం బయట పెట్టిన సంగతి తెలిసిందే.

Hyderabad : బీసీ కుల సంఘాలతో భేటీ కానున్న మంత్రులు
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే(Cast Census Survey)ను ప్రభుత్వం బయట పెట్టిన సంగతి తెలిసిందే. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి మరీ.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కులగణన వివరాల నువేదికను బయట పెట్టింది. అయితే ఈ నివేదికలో బీసీల సంఖ్యను కావాలని తప్పుగా చూపించారని పలువురు కాంగ్రెస్ బీసీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావాలనే బీసీల సంఖ్యను తగ్గించి చూపెట్టారని స్వయానా కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna) తీవ్ర ఆరోపణలు చేశారు. కులగణన నివేదిక పత్రాలను తగలబెడుతూ ఓ వీడియో కూడా విడుదల చేశారు. ఈ వ్యవహారం ఇటు ప్రజల్లో అటు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. కాగా ఈ విషయంపై చర్చించేందుకు మంత్రులు బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం కానున్నారు. శనివారం సాయంత్రం మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), కొండా సురేఖ(Konda Surekha), ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు(K Keshava Rao)లు సచివాలయంలో బీసీ సంఘాల ముఖ్య నాయకులు, బీసీ మేధావులతో భేటీ అవనున్నారు. బీసీ కులగణనపై.. ప్రభుత్వం వెల్లడించిన నివేదిక వివరాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.

Next Story