మంత్రులు రావొద్దు.. రాహుల్ పర్యటన వేళ పీసీసీ ఆదేశాలతో మంత్రులు వెనక్కి

by Prasad Jukanti |   (  Updated:2026-03-02 06:38:17  IST  )

వికారాబాద్‍లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం ప్రారంభం అయింది. డీసీసీ శిక్షణ కార్యక్రమానికి మంత్రులకు అనుమతి లేకపోవడంతో వారు వెనుతిరిగారు.

మంత్రులు రావొద్దు..  రాహుల్ పర్యటన వేళ పీసీసీ ఆదేశాలతో  మంత్రులు వెనక్కి
X

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా అనంతగిరిలో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ మహేష్ గౌడ్ అధ్యక్షతన పీఏసీ సమావేశం కొనసాగుతోంది. తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.

వెనక్కి వెళ్లిపోయి‍న మంత్రులు

పీఏసీ సమావేశం అనంతరం డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. డీసీసీలకు శిక్షణ శిబిరానికి ముఖ్యఅతిథిగా రాహుల్ గాంధీ రావడంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు సైతం అనంతగరికి చేరుకున్నారు. అయితే డీసీసీ శిక్షణా తరగతులకు మంత్రులకు రావద్దని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఖరాఖండీగా చెప్పేశారు. దీంతో చేసేదేమి లేక రాహుల్ గాంధీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వికారాబాద్ కు వచ్చిన పలువురు మంత్రులు తిరిగి వికారాబాద్ నుంచి హైదరాబాద్కు బయల్దేరివెళ్లిపోయారు.

హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన CM రేవంత్ రెడ్డి

Next Story