ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రుల సమీక్ష

by Prasad Jukanti |

ములుగు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి సమీక్ష నిర్వహించారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రుల సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ములుగు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల (Irrigation Projects) పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన ప్రాజెక్టుల పనుల స్థితిగతులు, నిధుల వినియోగం, ఎదురవుతున్న అడ్డంకులపై అధికారులు వివరణ ఇచ్చారు. కాగా జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల సహా గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు గత నెలలో సీఎం ఈ ప్రాజెక్టులపై సీఎం క్లారిటీ ఇచ్చారు. రాబోయే రెండేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలనే చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. అవసరమైన నిధులు సత్వరం విడుదల చేస్తామన్నారు.

Next Story