TG Govt: 5 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం

by Gantepaka Srikanth |

ఐటీ నాలెడ్జ్ హబ్‌(IT Knowledge Hub)పై సచివాలయ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

TG Govt: 5 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ నాలెడ్జ్ హబ్‌(IT Knowledge Hub)పై సచివాలయ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), శ్రీధర్ బాబు(Sridhar Babu)లు అధికారులతో సమీక్షా సమావేశ నిర్వహించారు. పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాట్లపై చర్చించారు. ఐదు లక్షల మంది యువతకు ఉపాధి లభించడమే ప్రభుత్వ(Congress Govt) లక్ష్యమని మంత్రులు పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రగతిని మరింత వేగవంతం చేయాలని మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. అంతేకాదు.. ఐటీ రంగంలో ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కమిటీ నిర్ణయించింది. కాగా, ఐటీ నాలెడ్జ్ హబ్‌కు కేటాయించిన 450 ఎకరాల భూమిని గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌లు, రెవెన్యూ, స్పెషల్‌ పోలీస్‌ సొసైటీలకు కేటాయించిన విషయం తెలిసిందే. వివిధ సొసైటీలకు 200 ఎకరాల భూమి.. పక్కనే ఉన్న మరో 250 ఎకరాల భూములు కలిపి ఐటీ హబ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Next Story