- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచ దేశాల చూపు హైదరాబాద్ వైపు: మంత్రి పొన్నం
ప్రపంచ దేశాల చూపు హైదరాబాద్ వైపు: మంత్రి పొన్నం

దిశ, తెలంగాణ బ్యూరో: ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆదివారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌తో తెలంగాణ రాష్ట్రం దశదిశ మారుతుందని అన్నారు. ప్రపంచ స్థాయి సమ్మేళనంతో ప్రపంచ నగరాల స్థాయికి ఫ్యూచర్ సిటీ చేరుతుందని చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం రెండేళ్ల పాలన, 2047 లక్ష్యంగా సాగుతున్న ప్రణాళికలు తదితరాలకు ఊతమిచ్చే విధంగా పెట్టుబడులు రానున్నాయని అన్నారు. దేశ విదేశాలకు చెందిన 150 మంది ప్రముఖులు ఈ సమ్మిట్‌లో పాల్గొనబోతున్నారని చెప్పారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమ్మేళనం కోసం విశేష రీతిలో ఏర్పాట్లు జరిగాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్ వైపు ప్రపంచ దేశాల చూపు
గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. డిజిటల్ టెన్నెల్, సెషన్ హాల్‌లను ఆయన పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం అక్కడే కనువిందు చేస్తున్న ఆర్టీసీలో మొదటి తరం బస్సును సందర్శించారు. అప్పటి అల్బేన్ బస్సు నుండి ఎలక్ట్రిక్ బస్సు వరకు ఆర్టీసీ అభివృద్ధిని ప్రదర్శనగా పెట్టారు. ఆ ఆర్టీసీ బస్సులను మంత్రి ఆసక్తిగా తిలకించారు. మంత్రి వెంట స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్‌రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, ఇతర ఆర్టీసీ రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఉన్నారు.






