తెలంగాణ నెక్ట్స్ సీఎం అతనే.. మంత్రి జోస్యం

by Gantepaka Srikanth |

తెలంగాణ నెక్ట్స్ సీఎం అతనే.. మంత్రి జోస్యం

తెలంగాణ నెక్ట్స్ సీఎం అతనే.. మంత్రి జోస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తే.. మళ్లీ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) జోస్యం చెప్పారు. దేవరకొండలో శనివారం జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సభలో మంత్రి కోమటిరెడ్డి ఈ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లే కాదు ఆ తర్వాత ఐదేళ్లు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళుతున్నారని కొనియాడారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలోనే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ జిల్లాకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ పనులు ప్రారంభించగానే సొరంగంలో దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. సొరంగంలో ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ నేతలు సంబరపడ్డారు. ఏదేమైనా టన్నెల్‌ను పూర్తి చేసి నీరు అందిస్తాం’’ అని సీఎం అన్నారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు సభలో పాల్గొన్నారు.




Next Story