DK Aruna: అజారుద్దీన్‍కు మంత్రి పదవి సీక్రెట్ ఇదే: డీకే అరుణ

by Prasad Jukanti |   (  Updated:2025-10-29 13:52:16  IST  )

అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలనే కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ ఘాటు విమర్శలు చేశారు.

DK Aruna:  అజారుద్దీన్‍కు మంత్రి పదవి సీక్రెట్ ఇదే: డీకే అరుణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూహ్లీహిల్స్ లో ముస్లిం ఓట‌ర్లను ఆక‌ర్షించేందుకే మంత్రి వర్గంలోకి అజారుద్దీన్‍ను (Azharuddin) తీసుకోవాల‌ని చూస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో మొత్తం 4 లక్షల ఓటర్లు ఉంటే అందులో 1 లక్ష ఓటర్లకు పైగా ముస్లిం మైనార్టీ ఓటర్లే ఉన్నారని వారిని తమపైవు తిప్పుకునేందుకే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తోందని ఆరోపించారు. ఇక్కడ కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. జూబ్లీహిల్స్ లోని (Jubilee Hills) మైనార్టీలు ఈ విష‌యాన్ని గుర్తుంచుకుని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజ‌కీయాలను తిప్పికొట్టాలన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన డీకే అరుణ.. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్‍కు ఓట్లడిగే హక్కు లేదన్నారు. తెలంగాణ‌లో పాల‌న గాడిత‌ప్పిందనిని ఇచ్చిన ఆరు గ్యారంటీల అమ‌లులో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యిందని విమర్శించారు. దమ్ముంటే నాతో ప్రచారంలో రావాలని తాను నిరూపిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వానిక సవాల్ విసిరారు.

తెలంగాణ‌ ఖజానాను కొల్లగొట్టేలా కాంగ్రెస్ పాల‌న న‌డుస్తోందని ఎక్కడ చుసిన దోచుకోవ‌డం. పంచుకోవడం పంచాయితీలే నడుస్తున్నాయన్నారు. సీఎం నుంచి మంత్రుల దాకా అంద‌రికీ అదే తీరని ఘాటు విమర్శలు చేశారు. మంత్రుల మధ్య పంపకాల పంచాయంతిని ప్రజలంతా గమనించాలన్నారు. మరో మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేస్తామంటూ దేవుళ్లపై ఒట్లేసి ఇప్పుడు చేతులెత్తేశారన్నారు. ఇటీవ కొడంగల్ - వికారాబాద్ రైల్వై లైన్ అంటూ కొంద‌రు వార్తలు రాస్తున్నారని ఈ లైన్ రాష్ట్ర ప్రభుత్వమే తీస్తున్నట్లు రాస్తున్నారని సీఎం కొండ‌గ‌ల్ వికారాబాద్ అని కొత్త లైన్ ఏమైనా తెచ్చాడా? అది కృష్ణా - వికారాబాద్ రైల్వే లైన్ అన్నారు. అవ‌గాహ‌న లేకుండా జర్నలిస్టులు వార్తలు రాస్తే ఎలా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేస్తే వాళ్లు ఆ రైల్వే లైన్ తెచ్చినట్లా అని ప్రశ్నించారు.

Next Story