- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సవాళ్లపై స్వారీ చేస్తూనే.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర బడ్జెట్(Telangana Budget 2025-2026)పై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర బడ్జెట్(Telangana Budget 2025-2026)పై మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించిన బడ్జెట్ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) నేతృత్వంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇవాళ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి తగిన మేరకు కేటాయింపులు చేయడం శుభపరిణామ అని అన్నారు. బడ్జెట్ సమ్మిళిత వృద్ధిని ప్రతిబింబింబిస్తుందని తెలిపారు. ఒక వైపు అభివృద్ధి... మరోవైపు సంక్షేమాన్ని సముతుల్యత చేస్తూ.. రాష్ట్ర బడ్జెట్(Telangana Budget) దిశానిర్ధేశం చేసేలా ఉందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా ఉందని.. ఉపాధి కల్పనకు ఊతం ఇస్తూ.. మహిళా సంక్షేమం, యువత, దళితులు, గిరిజనుల సంక్షేమానికి దిక్సూచిలా ఉందని అన్నారు. యావత్ తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్‌ను భట్టి విక్రమార్క రూపొందించడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. సవాళ్ళపై స్వారీ చేస్తూనే.. రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రాంత ప్రజల ఆర్థిక స్థిరత్వానికి బాటలు వేస్తుందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్కకు.. శాసనమండలిలో ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబుకు అభినందనలు చెప్పారు.






