- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ మాటల్లో అది మాత్రం క్లియర్‌గా అర్థమైంది.. మంత్రుల కౌంటర్
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్(BRS) రజతోత్సవ సభలో కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యలకు మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), సీతక్క(Seethakka) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్(BRS) రజతోత్సవ సభలో కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యలకు మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), సీతక్క(Seethakka) స్పందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయిన నియంత ఆవేదన ఎలా ఉంటుందో.. కేసీఆర్ ప్రసంగం అలాగే ఉందని విమర్శించారు. ముందు కల్వకుంట్ల కుటుంబంలోని చీలికలు, పేలికలు సరిచేసుకోవాలని సూచించారు. కేసీఆర్ మాటల్లో ఆ బాధ కూడా కనిపించిందని అన్నారు. పది నెలల్లో 59,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ కూతురు మంచి మంచి కార్లలో తిరుగుతుంది.. మా పేద ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో తిరగకూడదా? అని అడిగారు. ఆర్టీసీ(TG RTC)ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. దేశంలో పోలీసులను కేసీఆర్ వాడుకున్నంతగా ఎవరూ వాడుకోలేదని అన్నారు. 60 వేల కోట్ల కరెంట్ బిల్లుల బకాయిలు పెట్టి.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇవాళ గొప్పలు చెప్పుకున్నాడని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హయాంలో కనీసం ధర్నాలు కూడా చేసుకోనీయలేదని గుర్తుచేశారు. ఎల్కతుర్తిలో రైతుల పంటపొలాల్లో సభ పెట్టి.. కాలవలు పూడ్చారని కీలక ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు అంటూ.. తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ అవమానించారని సీరియస్ అయ్యారు. కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే అర్హతే లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో సొల్లే మాట్లాడుకుంటుంటే.. మరి నీ కొడుకు, అల్లుడ్ని ఎందుకు పంపిస్తున్నామని మండిపడ్డారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణే లేదని.. ఆమె రాష్ట్రం ఇచ్చింది కాబట్టే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని.. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు.






