- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుర్యోధనుడిగా మంత్రి, కట్టప్పగా ఎమ్మెల్సీ: తెలంగాణ ప్రజాప్రతినిధుల 'నట' విశ్వరూపం!
తెలంగాణ శాసనసభ సభ్యుల కోసం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన 'స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్' అట్టహాసంగా జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ సభ్యుల కోసం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన 'స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్' అట్టహాసంగా జరిగింది. నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే నాయకులు.. ఈ వేదికపై తమలోని అసలైన కళాకారులను బయటకు తీశారు. పౌరాణిక పాత్రల నుండి జానపద నృత్యాల వరకు ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో అదరగొట్టారు.
కళా ప్రదర్శనల హైలైట్స్..
ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మంత్రి వాకిటి శ్రీహరి ప్రదర్శన. దుర్యోధనుడి వేషధారణలో ఆయన పలికిన డైలాగులు, గంభీరమైన నటన చూసి సభికులు మంత్రముగ్ధులయ్యారు. మంత్రిలోని పౌరాణిక నటుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరోవైపు.. 'బాహుబలి' సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన కట్టప్ప పాత్రలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఒదిగిపోయారు. ఆయన వేషధారణ, నడక తీరు కట్టప్పను గుర్తుచేస్తూ అలరించాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తనదైన శైలిలో గిరిజన సాంప్రదాయ నృత్యాన్ని ప్రదర్శించారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఆయన వేసిన అడుగులు అందరినీ ఆకట్టుకున్నాయి. సీనియర్ నటుడు శోభన్ బాబు నటించిన సూపర్ హిట్ పాటకు రామచంద్ర నాయక్ చేసిన డాన్స్ హైలైట్‌గా నిలిచింది. తనదైన గ్రేస్‌తో ఆయన చేసిన స్టెప్పులకు కేకలు వినిపించాయి. వైరా ఎమ్మెల్యే రామ్‌దాస్ నాయక్ గిరిజన పాటకు హుషారుగా డాన్స్ చేశారు. ఆయన ఉత్సాహాన్ని చూసి తోటి ఎమ్మెల్యేలు కూడా తలలూపారు.
రాజకీయాలకు అతీతంగా వినోదం..
ప్రజాప్రతినిధులందరూ ఒకే వేదికపై చేరి తమ కళలను ప్రదర్శించడం చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "మా నాయకులు కేవలం ప్రసంగాల్లోనే కాదు.. నటనలో, నాట్యంలో కూడా దిట్టలే" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కల్చరల్ మీట్ తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో ఒక చిరస్మరణీయమైన వేడుకగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కన్నారు. వీడియో






