పోలింగ్ వేళ వివాదంలో చిక్కుకున్న మంత్రి.. ఏం చేశాడో తెలుసా..?

by Sathputhe Rajesh |   (  Updated:2023-11-30 02:59:38  IST  )

తెలంగాణ ఎన్నికల పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది.

పోలింగ్ వేళ వివాదంలో చిక్కుకున్న మంత్రి.. ఏం చేశాడో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఇక, మంత్రి, నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్ర కిరణ్ రెడ్డి తీరు వివాదాస్పదమైంది. పోలింగ్ కేంద్రానికి ఆయన బీఆర్ఎస్ కండువా వేసుకుని రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన తన ఓటు హక్కును ఎల్లపల్లి గ్రామంలో వినియోగించుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకుని వెళ్లడం ఏంటని ఇది ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అల్లోల వివాదాస్పద వైఖరిపై ఎన్నికల అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Next Story