- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్‌కు టిఫిన్ బాక్స్ ఇచ్చిన మంత్రి
తెలంగాణలో ఎవరూ ప్లాస్టిక్ వాడొద్దని.. పర్యావరణాన్ని నష్టపరచొద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎవరూ ప్లాస్టిక్ వాడొద్దని.. పర్యావరణాన్ని నష్టపరచొద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) పిలుపునిచ్చారు. గురువారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ(Telangana Assembly) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) చేతుల మీదుగా ప్లాస్టిక్‌వినియోగం ప్రమాద ఘంటికలు పుస్తకాన్ని ఆవిష్కరించారు.
మంత్రి కొండా సురేఖ పర్యావరణ పరిరక్షణకు ‘సే నో టూ ప్లాస్టిక్’(Say No to Plastic) నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులకు జూట్బ్యాగు, పుస్తకం, కాపర్బాటిల్, స్టీల్టిఫిన్బాక్సు, బట్ట సంచులను మంత్రి కొండా సురేఖ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖతో పాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు(పీసీబీ) మెంబర్ సెక్రటరీ గుగులోత్ రవి ఉన్నారు.
ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్ల కంటే ఎక్కువ ప్లాస్టిక్ సంచులు వాడి పారేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిమిషం 10 లక్షలు వాటర్ బాటిళ్లు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు 630 కోట్ల టన్నులు అని వివరించారు. వీటిలో 79% ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాలు, నీటి వనరులలో పారేస్తున్నారన్నారు. మిగిలిన 12% ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిపై వదిలేస్తున్నారని చెప్పారు. 9% మాత్రమే రీసైకిల్ చేయబడుతున్నాయన్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు.. మన కాల్వలు, సరస్సులు, నదీ ప్రవాహాలను అడ్డుకుంటున్నాయన్నారు. మొక్కలు, వృక్షాలు, జంతు జలాన్ని పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయన్నారు.
ప్లాస్టిక్వ్యర్థాలను కాల్చడం వల్ల క్యాన్సర్ కారక విషపూరిత వాయులు వెలువడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు నివారించి జూట్, బట్ట సంచులను వాడాలని సూచించారు. జూట్ బ్యాగ్, బట్ట సంచులు, అలాగే ప్లాస్టిక్బ్లాటిల్స్వినియోగాన్ని నివారించి దానికి బదులుగా గ్లాస్ బాటిల్స్, స్టీల్ బాటిల్స్ ఉపయోగించాలని.. వీరందరి సురేఖ కాపర్బాటిల్నేతలందరికీ అందజేశారు. ప్లాస్టిక్ బాక్సులలో ఆహారాన్ని వినియోగించొద్దని తెలియజేస్తూ స్టీల్ టిఫిన్బాక్సును అందజేశారు.






