- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vivek: బాధ్యతలు స్వీకరించిన మంత్రి వివేక్.. ఆ ఫైల్ పైనే తొలి సంతకం
వివేక్ వెంకట స్వామి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనుల మరియు భూగర్భ శాఖా మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి (Gaddam Vivek Venkata Swamy) బాధ్యతలు స్వీకరిచారు. ఇవాళ ఉదయం సెక్రటేరియట్ (Telangana Secretariat) లోని సెకండ్ ఫ్లోర్ లో తనకు కేటాయించిన చాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు తన చాంబర్ కు వచ్చిన మంత్రికి పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంబంధింత శాఖల అధికారులు, నాయకులు వివేక్ కు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించాక కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ల (ATC) ఫైల్ పై వివేక్ తొలి సంతకం చేశారు. రూ. 2600 కోట్ల నిధులకు సంబధించిన ఫైల్ పై ఆయన సంతకం చేశారు. కాగా రాష్ట్రంలోని ఐటీఐలన్నింటిని ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గతంలోనే నిర్ణయించారు. ఐటీఐలు లేని చోట ఏటీసీలలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.






