- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vakiti Srihari: కేబినెట్ సమావేశంపై మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర కేబినెట్సమావేశం రేపు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర కేబినెట్సమావేశం రేపు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ క్రమంలోనే కేబినెట్ సమావేశంపై రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు రాహుల్ గాంధీ ఆలోచన అని, ఉభయ సభల్లో తీర్మానాలు చేసి ఆమోదించామని వివరించారు. రేపు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలుంటాయని క్లారిటీ ఇచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో ప్రజలు అభివృద్ధికే ఓటేశారని తెలిపారు. మా పనితీరుకు జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెండం అని చెప్పుకొచ్చారు. అంతకు ముందు ధర్మసాగర్ రిజర్వాయర్‌లో మత్స్యకారులకు 100 శాతం రాయితీతో చేపలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమపై ఆధారపడిన మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధి, సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. తెలంగాణలో 26,600 చెరువులు ఉణ్నాయని తెలిపారు. ఈ సంవత్సరం చెరువుల ద్వారా రాష్ట్రంలో 8 మెట్రిక్ టన్నుల చేప పిల్లలను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్లు వివరించారు.






