త‌న‌ను చంపేందుకు కుట్ర‌లు..మంత్రి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

by velandi.Saikiran |

ఓ సందర్భంలో తనను చంపేందుకు ప్రయత్నం చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి వాకిటి శ్రీహ‌రి.

త‌న‌ను చంపేందుకు కుట్ర‌లు..మంత్రి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
X

*త‌న‌ను చంపేందుకు కుట్ర‌లు చేశారంటూ ఆరోపణ‌లు*

*ఊట్కూర్ వేదిక‌గా మంత్రి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు*

దిశ, ఊట్కూర్: తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ సందర్భంలో తనను చంపేందుకు ప్రయత్నం చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి వాకిటి శ్రీహ‌రి. మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో రూ.3.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహ‌రి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

టెండర్లకు వెళ్లిన పనులను ఆపివేస్తూ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. మన ప్రాంత భవిష్యత్తు కోసం కృషి చేయకపోతే బ‌తికి దండగా అన్నారు. గొప్పగా బ‌తకడం అంటే జల్సాలు చేయడం కాదు అని పేర్కొన్నారు. తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని, అయినప్పటికీ ప్రజల అండదండలు ఉన్నంతవరకు ఎవరికి భయపడబోనని స్పష్టం చేశారు. ఒకానొక‌ సందర్భంలో త‌న‌ను చంపాలని ప్రయత్నం చేశారని...తాను చావుకు బెదరబోను అని హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహ‌రి.

Next Story