- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ, అంతర్జాతీయ క్రీడా ఫెడరేషన్లకు ప్రభుత్వ సహకారం : మంత్రి వాకిటి శ్రీహరి
జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించేందుకు ముందుకు వచ్చే క్రీడా ఫెడరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందజేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించేందుకు ముందుకు వచ్చే క్రీడా ఫెడరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందజేస్తుందని రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) తెలిపారు. 2026 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ (2026 Women's Hockey World Cup) క్వాలిఫయర్ టోర్నమెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశాలు సౌకర్యాలపై పరిశీలన కోసం వచ్చిన హాకీ ఇండియా ప్రతినిధులు గురువారం నివాసంలో కలిశారు. వారిని సన్మానించి,తెలంగాణలో క్రీడలకు ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను వివరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్‌లో అంతర్జాతీయ పోటీల నిర్వహణకు తగిన సదుపాయాలు, మౌలిక వసతులు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా అభివృద్ధి పట్ల కట్టుబడి ఉందని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు జరిగేలా అన్ని విధాల సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
హాకీ ఇండియా ప్రతినిధులు గచ్చిబౌలి, బేగంపేట హాకీ స్టేడియాలను పరిశీలించారు. గచ్చిబౌలి స్టేడియంలోని సదుపాయాలు పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ వేదికను ఉమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్ పోటీలకు అనుకూలంగా గుర్తించారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 15 మధ్య కాలంలో ఈ పోటీలు జరిగే అవకాశముందని ఇందుకోసం చేపట్టాల్సిన పనులపై హాకీ ఫెడరేషన్ ప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు సమావేశమై చర్చించారు. వీటిపై నివేదిక సిద్ధం చేసి, ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. ఏ. సోనీ బాలాదేవి, హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ బోలా నాథ్ సింగ్, కోశాధికారి శేఖర్ జై మనోహరన్, డైరెక్టర్ జనరల్ వి.ఎస్.ఎం. ఆర్.కె. శ్రీవాత్సవ, డైరెక్టర్ బి.ఎన్.భూషణ్ విక్రమ్ పాల్, తెలంగాణ హాకీ అసోసియేషన్ కార్యదర్శి భీమ్ సింగ్, కోశాధికారి కళ్యాణి, స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.






