- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధ్యాహ్న భోజనం పథకంలో చేపలు : మంత్రి వాకిటి
మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మంగళవారం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరల్డ్ ఆక్వా కల్చర్ ఇండియా కాన్ఫఫెరెన్స్ కు ముఖ్యఅతిథిగా హాజరై మత్స్య శాఖపై రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి ఇప్పటి వరకు మత్స్య శాఖ ను ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వలేదని,మొదటి సారిగా కాంగ్రెస్ ప్రభుత్వం తనకు మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.
గతంలో నిర్వీర్యానికి గురైన మత్స్య శాఖను పునర్నిర్మాణం చేస్తూ తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి మంత్రివర్గ సమావేశంలో మత్స్య శాఖకు దాదాపుగా రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. అదేవిధంగా రూ.1.40 కోట్లతో మత్స్యకారులకు బీమా కల్పించినట్లు, తెలంగాణ గోదావరి,కృష్ణా నదులు మధ్య ఉండటమే కాకుండా గొలుసు కట్టు చెరువులు ఒక గొప్ప వరం అన్నారు. ఈ నీటి వనరులు మత్స్య సంపదకు ఇది ఎంతగానో దోహద పడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్య శాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
తెలంగాణలో ఉన్న దాదాపుగా 26వేల నీటి వనరుల్లో చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వీటిల్లో 84 కోట్ల చేప పిల్లలు,10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. పారదర్శకతకు కేర్ ఆఫ్ అడ్రస్సుగా రిజర్వాయర్లలో అడిషనల్ కలెక్టర్ ,పెద్ద చెరువుల్లో ఆర్డీవో , చిన్న చెరువుల్లో తహసీల్దార్ఆధ్వర్యంలో చేపపిల్లల పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా చేపపిల్లల పంపిణీ సంబధించిన వివరాలు తెలియజేస్తూ చెరువు వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎలాంటి భేషజాలకు పోకుండా అందరి సహకారంతో రాష్ట్రంలో మత్స్య శాఖ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
భారీగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి మధ్యాహ్న భోజనం పథకంలో చేపలు ఆహారం అమలయ్యేలా చూస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, తెలంగాణ ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, ఎన్ఎఫ్డీబీ సీఈఓ బెహరా,జాయింట్ సెక్రటరీ నీతు కుమారి,జాయ్ కృష్ణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐకార్,పీవీఎన్ఆర్ వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జ్ఞానప్రకాష్,ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.






