ఆ ట్రీట్మెంట్ నరకం.. యువకులు అర్థం చేసుకోవాలి: మంత్రి వాకిటి

by Ajay Maddhiboyina |

యువ‌కులు డ్ర‌గ్స్ కు దూరంగా ఉండాల‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి కోరారు. ఓ కాలేజీ ఈవెంట్ లో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. డ్ర‌గ్స్ మాన్ప‌నించేందుకు డీహైడ్రేష‌న్ సెంటర్స్ లో చేర్పిస్తున్నార‌ని అన్నారు. ఆ డీహైడ్రేష‌న్ సెంట‌ర్లు జైలు జీవితం మాదిరిగా ఉంటున్నాయ‌ని చెప్పారు.

ఆ ట్రీట్మెంట్ నరకం.. యువకులు అర్థం చేసుకోవాలి: మంత్రి వాకిటి
X

దిశ‌, వెబ్ డెస్క్: యువ‌కులు డ్ర‌గ్స్ కు దూరంగా ఉండాల‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి కోరారు. ఓ కాలేజీ ఈవెంట్ లో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. డ్ర‌గ్స్ మాన్ప‌నించేందుకు డీహైడ్రేష‌న్ సెంటర్స్ లో చేర్పిస్తున్నార‌ని అన్నారు. ఆ డీహైడ్రేష‌న్ సెంట‌ర్లు జైలు జీవితం మాదిరిగా ఉంటున్నాయ‌ని చెప్పారు. అత్యంత దారుణంగా అందులో ట్రీట్మెంట్ ఉంటుంద‌ని తెలిపారు. రెండు మూడు నెల‌లు అందులో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తే త‌ప్ప అందులో నుండి బ‌య‌ట‌కు రాలేర‌ని అన్నారు.

పిల్ల‌ల‌ను అందులో చేర్పించి త‌ల్లిదండ్రులు కూడా న‌ర‌కం అనుభ‌విస్తార‌ని చెప్పారు. పేరెంట్స్ ఎంతో క‌ష్ట‌ప‌డి పిల్ల‌ల‌ను కాలేజీల్లో చేర్పిస్తున్నార‌ని కాబ‌ట్టి అలాంటి అల‌వాట్ల‌కు దూరంగా ఉండాల‌ని అన్నారు. స్నేహితులు చెప్పార‌నో, ఎవ‌రో చెప్పారనో చెడు అల‌వాట్లు చేసుకోవ‌ద్ద‌ని కోరారు. ప్ర‌భుత్వం కూడా డ్ర‌గ్స్, గంజాయి ప‌ట్ల సీరియ‌స్ గా ఉంద‌ని అన్నారు. డ్ర‌గ్స్ నిర్మూల‌న కోసం ప్ర‌భుత్వం ఈగ‌ల్ అనే వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసింద‌ని తెలిపారు.

Next Story