- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : తడిసిన ధాన్యాన్ని కొంటాం : మంత్రి ఉత్తమ్
అకాల వర్షాలతో పంటలు నష్టపోయి(Crop Damage) తీవ్ర దుఖంలో ఉన్న రైతులకు(Farmers) తెలంగాణ సర్కార్(Telangana Govt) వారి కన్నీళ్ళు తుడిచే ప్రకటన చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : అకాల వర్షాలతో పంటలు నష్టపోయి(Crop Damage) తీవ్ర దుఖంలో ఉన్న రైతులకు(Farmers) తెలంగాణ సర్కార్(Telangana Govt) వారి కన్నీళ్ళు తుడిచే ప్రకటన చేసింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడం, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttham Kumar Reddy) ప్రకటించారు. యాసంగి సీజన్(Rabi Season)లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని, తడిసిన ధాన్యం సహా, చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని వెల్లడించారు. అలాగే పంటలు, పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఈ సీజన్‌లో మొత్తం 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలియజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ట్యాబ్ ఎంట్రీ పూర్తయిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని అన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.






