- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బనకచర్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం.. హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కౌంటర్
బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ సైతం ఇప్పటికే దాఖలు చేశాం.

దిశ, వెబ్‌డెస్క్: బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla Project)పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు(Harish Rao) చేసిన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాగునీటి అంశంపై హరీష్ రావు అబద్ధాలు చెబుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ సైతం ఇప్పటికే దాఖలు చేశాం. జనవరి 5వ తేదీన పిటిషన్ విచారణకు వస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. అంతకుముందు హరీష్ రావు మాట్లాడుతూ.. బనకచర్లతో తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ముందుగానే పసిగట్టిన బీఆర్‌ఎస్ పార్టీ రణభేరి మోగించిందని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ బల్లెంపెట్టి పొడిచినా రేవంత్ ప్రభుత్వం నిద్రలేవలేదని చెప్పారు. మేం ఎన్నో ప్రెస్‌మీట్‌లు పెట్టి హెచ్చరించినా కూడా ప్రభుత్వంలో చలనం రాలేదని విమర్శించారు. తాను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యాక్ డేట్‌ల లెటర్ రాస్తుంటారని ఎద్దేవా చేశారు. తాను తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ పెడితే నిన్నటి డేటో, మొన్నటి డేటో పెట్టి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉత్తరం రాస్తారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్లే ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోందని అన్నారు.






