- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ఇష్టానుసారంగా కాళేశ్వరం డిజైన్ మార్చారు.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం కేబినెట్(Telangana Cabinet) సమావేశం అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తుమ్మడిహట్టి దగ్గర కట్టాలని ముందుగా నిర్ణయించారు. రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా ప్రాజెక్టు(Kaleshwaram Project)ను డిజైన్ చేశారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఇష్టానుసారంగా ప్రాజెక్టు డిజైన్ మార్చారు. అత్యధిక వడ్డీకి NBFCల దగ్గర లోన్లు తీసుకొచ్చారు. అధిక వడ్డీలకు రూ.84 వేల కోట్ల రుణాలు తీసుకొచ్చారు. ఈ రుణాలు తీసుకొచ్చే విషయంలో అవకతవకలకు పాల్పడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కాళేశ్వరంపై విచారణకు ఆదేశించారు. రాజకీయ అంశాలతో సంబంధం లేకుండా పీసీ ఘోష్ కమిషన్ వేశాం. కమిషన్ 605 పేజీలతో కూడిన రిపోర్టును ప్రభుత్వానికి ఇచ్చింది. కమిటీ రిపోర్టు అధ్యయానికి ముగ్గురు అధికారులతో మరో కమిటీ వేశాం. ఆ కమిటీ నివేదికను 25 పేజీలకు కుదించింది. ప్రజాధనం దుర్వినియోగం అయిందని నివేదిక స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని NDSA చెప్పింది. తాము అధికారంలోకి రాకముందే బ్యారేజీ కుంగిపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.






