Uttam Kumar Reddy: ఆయన తెలంగాణ కాంగ్రెస్‌కు మూల స్తంభం

by Gantepaka Srikanth |

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

Uttam Kumar Reddy: ఆయన తెలంగాణ కాంగ్రెస్‌కు మూల స్తంభం
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Telangana Congress)కి ప్రేమ్ సాగర్ రావు(Premsagar Rao) మూల స్తంభం అని వ్యాఖ్యానించారు. ప్రజలందరికీ అన్ని పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. పంచాయతీ ఎన్నికలను అతి త్వరలో నిర్వహిస్తామని తెలిపారు. కేబినెట్ విస్తరణ సీక్రెట్ అంశం.. ఇప్పుడే ఏం చెప్పలేం అని అన్నారు. బీఆర్ఎస్(BRS) నాయకులు ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. నాలుగు ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. ఆన్ గోయింగ్ పథకాలు ఆగే ప్రసక్తే లేదని, 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో క్రెడిబులిటీ ఉన్న నాయకుడిగా చెబుతున్నానని తెలిపారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతో ఎవరు ఆందోళన చెందొద్దని ప్రజలకు హితవు పలికారు.

ఇంతకంటే మంచి పాలన తాను చూడలేదన్నారు. ఇన్ని పథకాలు ఎవరు అమలు చేయలేదని తెలిపారు. ప్రభుత్వ పథకాలను వేగం పెంచడమే కాకుండా.. పంచాయతీ ఎన్నికలను అతి త్వరలో నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదని, ప్రజలందరికీ అన్ని పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పొలిటికల్‌గా తనకు ఒక విశ్వసనీయత ఉందని, వరుసగా ఏడుసార్లు గెలిచిన వ్యక్తిని తాను అని అనారు. కేటీఆర్(KTR) అరెస్టుపై స్పందించడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరాకరించారు. హుజుర్​నగర్​సొంత నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టకపోవడంపై ఇంజినీర్లపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే పనులు చేపట్టాలని ఫోన్‌లోనే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ సమస్య వస్తుందో తెలుసుకొని పనులను మొదలు పెట్టాలని ఉన్నతాధికారులకు ఉకుం జారీ చేశారు. పనులు మొదలు కాకపోవడం గురించి ఒకరిపై ఒకరు నెపం వేసుకోవడంపై జిల్లా అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సూర్యాపేట సీఈతో పాటు జిల్లా ఇరిగేషన్ అధికారులను వెంటనే హైద్రాబాద్ ఆఫీస్‌కు రావాలని ఈఎన్​సీకి ఆదేశాలు జారీ చేశారు. సొంత నియోజకవర్గంలోనే పనులు కాకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏంటని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Next Story