జవహర్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్

by Ramesh Naini |

ఖమ్మం జిల్లా మధిర మండలంలోని వంగవీడులో జవహర్ ఎత్తిపోతల పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు.

జవహర్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం జిల్లా మధిర మండలంలోని వంగవీడులో (Jawahar Lift Irrigation Scheme) జవహర్ ఎత్తిపోతల పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. జవహర్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ పథకం మధిర నియోజకవర్గానికి గేమ్ ఛేంజర్ అని కొనియాడారు. ఈ పథకానికి రూ.630 కోట్లు నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. పథకం టెండర్లు కూడా పూర్తి అయినట్లు స్పష్టం చేశారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని వేదికపై నుంచే అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ఒక ఏడాదిలోనే పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. ఈ స్కీమ్ ద్వారా 33 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయని స్పష్టం చేశారు.

భట్టి విక్రమార్క అత్యంత కష్ట కాలంలో నాడు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టారని గుర్తుకు చేశారు. ప్రతిపక్షనాయకుడిగా కేసీఆర్‌ను గడగడలాండించిన నాయకుడు భట్టి అని కొనియడారు. గత ప్రభుత్వంలో ఉన్న వారు రూ.7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారని, దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. వారు చేసిన అప్పులకు వడ్డీలు, అసలు కట్టాలని, మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే క్లిష్టమైన పరిస్థితుల్లో చాలా సమర్ధవంతంగా ఆర్థిక శాఖను భట్టి విక్రమార్క నడిపిస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల కృషి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. అందుకోసమే భట్టి విక్రమార్కకి రెండు పదవులు, పొంగులేటికి శ్రీనివాస్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వర్ రావుకు పవర్ ఫుల్ పదవులు వచ్చాయన్నారు. రాష్ట్రాన్ని నడిపించేది ఉమ్మడి ఖమ్మం జిల్లానే అని తాను, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుకుంటామని సరదా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన శాఖలు అన్ని ఇక్కడి మంత్రులకే ఉన్నాయని తెలిపారు.

Next Story