డిమాండ్.. సప్లైపై ఆరా తీస్తాం: గ్యాస్ ఏజెన్సీలకు మంత్రి ఉత్తమ్ హెచ్చరిక

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.

డిమాండ్.. సప్లైపై ఆరా తీస్తాం: గ్యాస్ ఏజెన్సీలకు మంత్రి ఉత్తమ్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం గ్యాస్ ఏజెన్సీలతో సమావేశం అవుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్యాస్ డిమాండ్, సప్లైపై ఆరా తీస్తామని అన్నారు. గ్యాస్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా గ్యాస్ ఏజెన్సీలకు మంత్రి ఉత్తమ్ వార్నింగ్ ఇచ్చారు. గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్లలో విక్రయిస్తే ఏజెన్సీలు రద్దు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్‌కు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కమర్షియల్ సిలిండర్ల కొరత ఉందని తెలిసిందని అన్నారు. రేపటి సమావేశంలో అన్ని సమస్యలకు పరిష్కారం చూసుతామని తెలిపారు. మరో వైపు.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్, చమురుకు తీవ్ర కొరత ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కేంద్రం చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. తెలంగాణలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాంతో హోటళ్లు, హాస్టల్స్, మెస్‌లకు అవసరమైన మేర కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో నగరంలో చాలా ప్రాంతాల్లో అవి మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Next Story