- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: కొరత ఉందనే భయాందోళనతో గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ రెట్టింపు
రాష్ట్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేపడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేపడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. డొమెస్టిక్సిలిండర్ల పంపిణీలో సమస్యలు లేవని, వాణిజ్య సిలిండర్ల సరఫరాలో కొన్ని ఇబ్బందులు ఎదురైతున్నట్లు అదనపు సిలిండర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. శనివారం సచివాలయంలో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, అసోసియేషన్ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేసినట్లు తెలిపారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా ప్రస్తుతం డిమాండ్‌లో 20 శాతం మాత్రమే తీరుస్తున్నాయని, అదేవిధంగా ఎల్పీజీ వినియోగదారుల్లోనే ఆందోళన జరుగుతుందన్నారు. గృహాలకు నిరంతరంగా సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా పనిచేస్తోంది. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు సంబంధించిన పానిక్ బుకింగ్‌లు, సరఫరా ఒత్తిళ్ల నివేదికల మధ్య, రాష్ట్రం అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ద్వారా వాణిజ్య సరఫరా సంక్షోభాన్ని పెంచిందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 811 మంది ఎల్పీజీ ఏజెన్సీల ద్వారా 1.03 కోట్ల కనెక్షన్లు ఉండగా అందులో 11 లక్షలు ఉజ్వల పథకం, 28 లక్షల మంది దీపం పథకం కింట వంట గ్యాస్సిలిండర్లు వాడుతున్నారు. అదనంగా 7.5 లక్షల మంది వాణిజ్య సిలిండర్లు వినియోగిస్తున్నారన్నారు. ప్రతి నెలా డొమెస్టిక్సిలిండర్లు 58 నుంచి 60 లక్షల వరకు పంపిణీ జరుగుతుందన్నారు. ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ల కొరత బాగా ఉందని, ఎల్పీజీ సిలిండర్లు గత కొద్ది రోజులుగా సాధారణం కంటే రెట్టింపు బుకింగ్‌లు అవుతాయన్నారు. కమర్షియల్సిలిండర్లు అవసరానికి రోజు 20 శాతమే పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. గృహ అవసరాలకు ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. గతంలో రోజుకు 2.15 లక్షల డొమెస్టిక్సిలిండర్లు సరఫరా జరిగేందని, గత రెండు రోజుల నుంచి 2.30 లక్షల వరకు సరఫరా చేస్తున్నామన్నారు. గతంలో వాణిజ్య సిలిండర్లు రోజుకు 23 వేలు పంపిణీ జరిగేందని ప్రస్తుతం 6200 మాత్రమే సరఫరా జరుగుతుందన్నారు. పశ్చిమాసియాలోని సరఫరా మార్గాలు మూసి వేయడంతో కొరత ఏర్పడింది, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతటా హోటళ్ళు, రెస్టారెంట్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వంటకాల్లో కొన్ని మెనూలను తగ్గించడం, తాత్కాలికంగా అవుట్‌లెట్‌లను మూసివేయడం, స్టాక్‌లు తగ్గడంతో వ్యాపారం బంద్చేస్తున్నారు.
పౌర సరఫరాల భవన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్..
పౌర సరఫరా భవన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ 24 గంటల పాటు చేస్తుందని అవసరమైన వినియోగదారులు టోల్ ఫ్రీ నెం- 1800-428-00-333 కానీ 1967ను సంప్రదించాలని సూచించారు. ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్ మార్కెటింగ్ తరలించడం, వాణిజ్య అవసరాల కోసం డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే కఠినమైన చర్యలు తప్పవన్నారు. ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్‌లలో తాత్కాలిక ఇబ్బందులు వచ్చాయని, దానిని సరిదిద్దేందుకు ఆ శాఖ చర్యలు చేపడుతోందన్నారు. సిలిండర్ల బుకింగ్పరిమిత మార్గదర్శకాలకు చేసుకోవాలని భయాందోళనకు గురై ఇష్టాను సారంగా బుక్ చేయవద్దని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అత్యవసరాలకు వినియోగించేందుకు 1,740 కేఎల్కిరోసిన్ అందుబాటులో ఉంచడం కూడా ఉంది. పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షించడానికి ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ, కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పడ్డాయి. భయాందోళనకు గురైన వినియోగదారులు బారులు తీరడంతో శాంతి భద్రత సమస్యలు వస్తే పంపిణీదారులకు అన్ని రకాల రక్షణ చర్యలు ప్రభుత్వం అందిస్తుందన్నారు.






