పదేళ్లలో ఇరిగేషన్ పై ఖర్చు పెట్టింది రూ.1.83 కోట్లు మాత్రమే.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ దిట్ట అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.

పదేళ్లలో ఇరిగేషన్ పై ఖర్చు పెట్టింది రూ.1.83 కోట్లు మాత్రమే.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ దిట్ట అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వాళ్లకే తెలివితేటలు ఉన్నట్లు, అవగాహన ఉన్నట్లు, గొప్పల సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మొత్తం బడ్జెట్ రూ.17.72 లక్షల కోట్లు అని, ఇరిగేషన్ పై ఖర్చు పెట్టింది రూ.1.83 కోట్లు మాత్రమే అని తెలిపారు. అది హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టారని తెలిపారు. పోనీ తీసుకొచ్చిన అప్పుల వల్ల ఎలాంటి ప్రయోజనం జరగకపోగా నష్టమే ఎక్కువ జరిగిందని, ఏడాదికి రూ.16 వేల కోట్లు అప్పు కడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 శాతం పనులు పూర్తి చేశామని కేసీఆర్‌, హరీశ్ చెబుతున్నారు.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. కానీ ఒక్క ఎకరాకు కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్‌ అన్నారు.

Next Story